నేడు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల.. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ రకాల దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది.
Ttd


తిరుమల, 28 నవంబర్ (హి.స.)

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ రకాల దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ముందుగానే టికెట్లు పొందేందుకు వీలుగా ఈ షెడ్యూల్ను విడుదల చేసింది.

టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం శనివారం (నేడు) ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

వైకుంఠ ద్వార దర్శనాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు టికెట్ల విడుదల సమయాలను గమనించి, అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. టికెట్ల కోసం చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణకు సంబంధించి టీటీడీ మరిన్ని ఏర్పాట్లు చేపడుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande