అల్లూరి జిల్లాలో చలి తీవ్రత.. రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.
Dense fog


అల్లూరి సీతారామరాజు జిల్లా, 28 నవంబర్ (హి.స.)

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా ఈ రెండు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో స్థానికులు చలితో ఇబ్బందులు పడుతున్నారు.

చింతపల్లిలోని ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 7.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు లంబసింగిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం.

ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. చలిని ఆస్వాదించేందుకు లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయా అనే అంశంపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande