కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా నిర్వహణ
కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు.
Vote


కృష్ణా జిల్లా, 04 నవంబర్ (హి.స.)

కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. నవంబర్ 5వ తేదీన జిల్లావ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఈ ప్రకటన చేశారు. ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు, అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు. అధికారికంగా ప్రకటించిన సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande