నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న ఒక అక్రమ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.
Fake


హైదరాబాద్ , 04 నవంబర్ (హి.స.)హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న ఒక అక్రమ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఒక ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు సుమారు ₹6.78 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు రహస్యంగా ఈ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో రూ.500 ముఖ విలువ కలిగిన భారీ ఎత్తున ప్రింట్ చేసిన నకిలీ నోట్లతో పాటు, నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న అధునాతన ప్రింటింగ్ మెషీన్లు, ప్రత్యేకమైన కాగితం, కలర్ డైలు మరియు ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా అసలు నోట్లను పోలి ఉండేలా అత్యంత నాణ్యతతో నకిలీ నోట్లను ముద్రించి, మార్కెట్లో చలామణి చేయడానికి ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా కీలక సూత్రధారులు ఉన్నారా లేదా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలతో ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande