
న్యూఢిల్లీ, నవంబర్ 4 (హి.స)
హిందూస్థాన్ సమాచార్ ఢిల్లీ కార్యాలయంలో
బుధవారం (నవంబర్ 4) ప్రముఖ పత్రికా రచయిత, పారిశ్రామికవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు భద్రతా సంస్థ 'ఎస్‌ఐఎస్' (SIS) వ్యవస్థాపకుడు
స్వర్గీయ రవీంద్ర కిశోర్ సిన్హా (ఆర్.కె.సిన్హా)
సంస్మరణ సభను నిర్వహించారు.హిందుస్థాన్ సమాచార్
న్యూస్ ఏజెన్సీ అధ్యక్షుడిగా సేవాలందించిన ఆర్.కె.సిన్హా దీర్ఘకాలిక అనారోగ్యంతో అక్టోబర్
30న కన్నుమూశారు.
ఢిల్లీలోని
పంచ్‌కుయా రోడ్‌లో ఉన్న హిందూస్థాన్ సమాచార్ కేంద్ర కార్యాలయంలో ఈ నివాళి సభను
ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో
న్యూస్ ఏజెన్సీ గ్రూప్ ఎడిటర్ రాంబహదూర్ రాయ్,
సీనియర్
జర్నలిస్ట్ అశోక్ టాండన్‌లతో పాటు ఏజెన్సీలో పనిచేస్తున్న ప్రస్తుత, మాజీ విలేకరులు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో
పనిచేస్తున్న సహచరులు గూగుల్ మీట్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఉదారత, పనితీరు మరియు సంస్థతో తమకున్న
అనుబంధాన్ని సహచరులు గుర్తుచేసుకున్నారు.
సీనియర్
జర్నలిస్ట్ రాంబహదూర్ రాయ్ మాట్లాడుతూ..ఒక
మిత్రుడిగా ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఎంతో క్లిష్ట సమయంలో ఏజెన్సీ బాధ్యతలను
స్వీకరించి, పాత్రికేయ రంగంలో
సంస్థను ముందుకు నడిపించారని కొనియాడారు.పారిశ్రామికవేత్తగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయనకు
రచన పట్ల ఉన్న ఆసక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అలాగే
జర్నలిస్ట్ అశోక్ టాండన్ మాట్లాడుతూ..స్వర్గీయ
బాలేశ్వర్ అగర్వాల్‌తో కలసి పనిచేసిన రోజుల్లో తమకు సహచరుడిగా ఉన్న ఆర్.కె.సిన్హాను గుర్తుచేసుకున్నారు.ఆయన ప్రేరణతోనే ఆర్.కె.సిన్హా హిందూస్థాన్ సమాచార్‌తో అనుబంధం
పెంచుకుని, సంస్థ బాధ్యతలు
చేపట్టారని వెల్లడించారు.
కార్యక్రమం
ముగింపులో హిందూస్థాన్ సమాచార్ సహచరులందరూ డాక్టర్ ఆర్.కె.సిన్హా చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు.అనంతరం ఆయన ఆత్మకు
శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
హిందూస్తాన్ సమచార్ / Sachin Budhauliya