ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: ఎన్నికల సంఘం స్పష్టత
ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: ఎన్నికల సంఘం స్పష్టత
EC


న్యూఢిల్లీ, 04 నవంబర్ (హి.స.)

ఓటర్ల

జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులందరూ నూతనంగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి

ఫారమ్-6 (Form-6) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల

సంఘం (ECI) స్పష్టం చేసింది. 18 సంవత్సరాలు నిండిన

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడానికి, లేదా గతంలో ఏ కారణం

చేతనైనా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడిన వారు తిరిగి నమోదు చేసుకోవడానికి ఈ

అవకాశం కల్పించారు.

ఓటర్ల

జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు ఈ మేరకు పౌరులకు అవగాహన

కల్పిస్తున్నారు.ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా ఓటరు నమోదు చేసుకోవచ్చని అధికారులు

తెలిపారు.దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) లేదా Voter Helpline యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్ విధానం

అందుబాటులో లేనివారు స్థానిక బూత్ స్థాయి అధికారి (BLO) లేదా

తహశీల్దార్ ఆఫీస్, మీ-సేవ/ఈ-సేవ కేంద్రాలను సంప్రదించి ఆఫ్‌లైన్

ద్వారా కూడా ఫారమ్-6 సమర్పించవచ్చు.

దరఖాస్తు

ప్రక్రియ కోసం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వయస్సు నిర్ధారణ పత్రం (ఆధార్ కార్డ్, పదో తరగతి మెమో,

లేదా జనన ధృవీకరణ

పత్రం) మరియు నివాస ధృవీకరణ పత్రం (ఆధార్, కరెంట్ బిల్లు, లేదా పాస్‌బుక్) జత చేయాల్సి ఉంటుంది.కొత్తగా చేరిన యువత మరియు

ఇంతవరకు ఓటు హక్కు లేని అర్హులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటరుగా నమోదు

చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande