మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక దుర్మరణం: బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక దుర్మరణం: బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక దుర్మరణం: బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, 04

నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా మణుగూరు డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24)

చికిత్స పొందుతూ మృతి

చెందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.గత

పది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రవళిక హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో తుదిశ్వాస

విడిచారు.

అక్టోబర్

25న మణుగూరు నుంచి

భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో చిల్లర విషయంలో ఒక మహిళా ప్రయాణికురాలితో

ప్రవళికకు వివాదం జరిగింది.అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద సదరు

ప్రయాణికురాలు కదులుతున్న బస్సు నుంచి ప్రవళికను నెట్టివేయడంతో ఆమె వెనుక టైర్ల

కింద పడి తీవ్రంగా గాయపడ్డారు.అత్యవసర వైద్యం కోసం ఆమెను వెంటనే

హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కఠిన చర్యలు మరియు ప్రభుత్వ భరోసా:విధి

నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడికి పాల్పడి మరణానికి కారణమైన నిందితులపై చట్టపరంగా

కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు

టీజీఎస్ఆర్టీసీ తరఫున రూ. 10

లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో పాటు ప్రవళిక తల్లికి ఆర్టీసీలో

ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబానికి

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande