మురసు తుపాను ప్రభావం.. కృష్ణా బోర్డు సమావేశం మరోసారి వాయిదా
కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది.
Krishna river


హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)

కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది. మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో తుపాను కారణంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు సహాయక చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సమావేశానికి హాజరుకావడం ఇబ్బందికరంగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం భావించింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి అధికారికంగా కోరింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను పరిశీలించిన బోర్డు అందుకు అంగీకరించింది. దీంతో ముందుగా నిర్ణయించిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై తదుపరి తేదీని ఖరారు చేయాల్సి ఉంది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొత్త తేదీ ఖరారైన తర్వాత సమావేశం నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande