బంజారాహిల్స్లో గేమింగ్ డెన్పై పోలీసుల మెరుపుదాడి.. 31 మంది అరెస్ట్
హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్వహిస్తున్న గేమింగ్ డెన్పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. రహస్య సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
TELANGANA police


హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో నిర్వహిస్తున్న గేమింగ్ డెన్పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. రహస్య సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు నిర్వహించిన దాడిలో మొత్తం 31 మందిని అరెస్టు చేశారు. వీరిలో 17 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. గేమింగ్ డెన్లో పేకాట, పోకర్ వంటి ఆటలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా అక్కడ పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా విదేశీ మద్యం బాటిళ్లు, పోకర్ ఆటకు ఉపయోగించే చిప్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనుమతులు లేకుండా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? గేమింగ్ డెన్ నిర్వహణకు సంబంధించిన వివరాలు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అరెస్టయిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు. నగరంలో అక్రమ గేమింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande