తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్న్యూస్.. ఉద్యోగ దరఖాస్తుల్లో భారీ వెసులుబాటు
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చిన నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే వివిధ నియామక ప్రక్రియల్లో మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకుండానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Telangana govt


హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చిన నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే వివిధ నియామక ప్రక్రియల్లో మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకుండానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు 2024 జూన్ 1వ తేదీకి ముందే తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి మాత్రమే వర్తించనుంది.

ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), పోలీస్ శాఖ, మెడికల్ బోర్డు ద్వారా చేపట్టే నియామకాలతో పాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ నియామకాలకు కూడా వర్తించనుంది. దీంతో మైగ్రేషన్ సర్టిఫికెట్ అందుబాటులో లేక ఉద్యోగ దరఖాస్తులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది.

అయితే మైగ్రేషన్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, అభ్యర్థులు తమ స్థానిక హోదాను నిరూపించే సంబంధిత పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్థానికతకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande