
న్యూఢిల్లీ, 05 నవంబర్ (హి.స.)
గ్రామీణ ప్రాంతాలలో పశుగ్రాస కొరతను తీర్చడంతో పాటు పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ఒకమ్మడిగా జాయింట్ అడ్వైజరీ (సంయుక్త మార్గదర్శకాలు) జారీ చేశాయి. వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) [VB-G RAM G] చట్టం కింద గ్రామీణ ఉపాధిని పశుగ్రాస ఉత్పత్తి, గోచర భూముల అభివృద్ధి, డెయిరీ మౌలిక వసతుల కల్పనతో అనుసంధానించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.
ఈ నూతన మార్గదర్శకాల కింద మొత్తం 22 రకాల పనులను ఆమోదయోగ్యమైనవిగా కేంద్రం గుర్తించింది. ఇందులో పశుగ్రాస సాగు, సమాజ ఆధారిత గడ్డిభూముల నిర్మాణం, పాడి పరిశ్రమకు కావలసిన షెడ్లు, పశువైద్య మౌలిక సదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులు మరియు భూమిలేని పేద కుటుంబాలకు పశుపోషణ ద్వారా నిలకడైన జీవనోపాధిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్ ఆధారంగా ఈ పనులన్నింటినీ స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేయనున్నారు. చట్టబద్ధమైన 125 రోజుల కూలీ ఉపాధితో పాటు రైతులు తమ సొంత భూముల్లో ఉపాధి హామీ మద్దతుతో పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi