
న్యూఢిల్లీ, 05 నవంబర్ (హి.స.)
భారత్ మరియు ఇటలీ దేశాల మధ్య జౌళి, ఫ్యాషన్, సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో భారత జౌళి శాఖ (Ministry of Textiles) కార్యదర్శి నిలమ్ షమీ రావు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఇటలీలో పర్యటిస్తోంది. ఈ అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీలోని ప్రముఖ జౌళి తయారీ కేంద్రమైన ప్లాటో (Prato) నగరాన్ని సందర్శించిన ప్రతినిధి బృందం, 'కాన్ఫిండస్ట్రియా తోస్కానా నోర్డ్' (Confindustria Toscana Nord - CTN) అధ్యక్షుడితో కీలక సమావేశం నిర్వహించింది.
ఈ పర్యటనలో భారత్-ఇటలీ జౌళి మరియు ఫ్యాషన్ రంగాల సహకారంపై ప్రత్యేక సెమినార్‌తో పాటు ఇరుదేశాల పారిశ్రామిక వేత్తల మధ్య వ్యాపార భాగస్వామ్యాల (B2B) చర్చలు జరిగాయి. భారతీయ జౌళి రంగానికి ఉన్న నైపుణ్యాలు, సాంప్రదాయ కళలు, తయారీ సామర్థ్యాలను ఇటలీకి చెందిన అత్యాధునిక డిజైన్, సాంకేతికత మరియు ఆవిష్కరణలతో అనుసంధానించడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం. అలాగే త్వరలో జరగనున్న భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ద్వారా ఇరు దేశాలకు లభించే వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులు మరియు 'భారత్ టెక్స్ 2027' (Bharat Tex 2027) గ్లోబల్ ఈవెంట్‌పై ఈ భేటీలో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi