
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)ప్రముఖ రచయిత, ‘నాగేటి సాల్లళ్ల నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆత్మను పలకరించిన అక్షర యోధుడు నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్గానూ పని చేశారు. తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి.. తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తిమంతమైన పాటల ద్వారా చాటూతూ.. తెలంగాణ ఉద్యమానికి ఓ గొప్ప ఊపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్