
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
బీఆర్ఎస్ను డ్రగ్స్ వివాదం వెంటాడుతున్నది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ కావడం మరింత ఆజ్యం పోసినట్టయింది. ప్రభుత్వంపై విమర్శల దాడులు చేద్దామనుకునే సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీని ఇబ్బంది నేతలు పెడుతున్నాయని చర్చించుకుంటున్నారు. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పదేపదే డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఆయనకు వైట్ చాలెంజ్ సైతం విసిరారు. డ్రగ్ టెస్ట్ కోసం తన తల వెంట్రుకలు ఇస్తానని, నీవు ఇస్తావా? అంటూ గన్పార్క్ వద్దకు వచ్చారు. కేటీఆర్కోర్టుకు వెళ్లి మరీ తనపై ఆరోపణలు చేయొద్దని ఆదేశాలను తెచ్చుకున్నారు.
సీఎం అయ్యాక కూడా కేటీఆర్ డ్రగ్స్ అడిక్టర్ అంటూ రేవంత్రెడ్డి ఆరోపణలు కొనసాగించారు. కేటీఆర్ బామమరిది రాజ్పాకాల ఇంట్లో పోలీసుల దాడులు జరిగినప్పుడు డ్రగ్స్ దొరికాయని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్, కేటీఆర్పై ఆరోపణలు గుప్పించారు. ఇలా పలుమార్లు డ్రగ్స్ వ్యవహారంబీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెడుతున్నది. కేటీఆర్ పై రేవంత్చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. అయినా కూడా పార్టీ ఇమేజ్కు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై యువత, మేధావులు, తల్లిదండ్రుల్లో చెడు అభిప్రాయం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే విమర్శల దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్మజీ ఎమ్మెల్యే పైలెట్లోహిత్రెడ్డి
డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. గతంలో ఆయన కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటనలో చిక్కుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ను తీవ్ర విమర్శల పాలుచేసింది. తాజాగా ఆయన ఫాం హౌస్లోనే డ్రగ్స్ పార్టీ జరగడంతో గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ వివాదంతో పార్టీకి సంబంధం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నా.. అధికార పార్టీ నాయకులు నేత్రం కేటీఆర్చుట్టే తిప్పుతున్నారు. దీనిపై కేటీఆర్స్వయంగా వివరణ ఇచ్చినా కాంగ్రెస్నేతలు మాత్రం ఆయన టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా వైట్చాలెంజ్, డ్రగ్స్స్ట్సవాల్ తెరపైకి వచ్చింది. కాగా, డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని, తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని కేటీఆర్ ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రతి డ్రగ్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..