
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు
కల్పించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గోల్కొండ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నగర జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, కలిసి గోల్కొండ జోన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భగత్ సింగ్ జంక్షన్ వద్ద అభివృద్ధి పనులు ఇందిరమ్మ క్యాంటీన్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై ఉన్న చిన్నపాటి గుంతలను వెంటనే పూడ్చి వేయాలని, సుందరీకరణలో భాగంగా అబిడ్స్ జంక్షన్లో ఉన్న పచ్చదనాన్ని కాపాడాలని, డివైడర్లు, ఖాళీ ప్రదేశాల్లో కొత్త మొక్కలను నాటి, ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత, సిబ్బంది హాజరును తనిఖీ చేసి, కేర్జేకర్లకు కీలక సూచనలు చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా టాయిలెట్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఉగాది నాటికి కమ్యూనిటీ హాల్ సిద్ధం చేయాలన్నారు. కమిషనర్ గోల్కొండ జోన్ అధికారులు రాంకీ సంస్థ ప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేస్తూ రోడ్లను, చెత్త సేకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ డీసీ ఉమా ప్రకాష్, గోల్కొండ జోన్ శానిటేషన్ ఏ సి, ఎస్ ఈ యు బీ డీ, డీ డీ, వెటర్నరీ డి డీ, ఈఈ, డీ ఈ ఈ, ఎస్ డబ్ల్యూ ఎం,అధికారులు, స్పోర్ట్స్ ఏడీ, టీపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు