
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తెలంగాణకు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తిచూపుతున్నామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెదేపా చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆక్షేపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ మీటింగ్కు వెళ్లటం లేదంటూనే.. ఏపీ డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు.
‘‘ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ అజెండా మొదటి అంశం... పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు. అజెండాలో నల్లమల సాగర్ లేకపోతేనే మీటింగ్కు వస్తామని చెప్పి, తర్వాత వెళ్లిపోయి తెలంగాణను మోసం చేశారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సీడబ్ల్యూసీ సమావేశంలో జీఆర్ఎంబీ చెప్పింది. జలాల పంపిణీ జరగలేదని జీఆర్ఎంబీ ఎలా చెబుతుంది? గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారు? గోదావరి బేసిన్లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారు? సీఎం రేవంత్రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోంది’’ అని హరీశ్రావు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్