ఉగాది సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కొత్త బట్టలు పంపిణీ చేసిన మంత్రి వాకిటి.
నారాయణపేట, 16 మార్చి (హి.స.) మున్సిపాలిటీలో శుభ్రత, పరిశుభ్రత పనులు చేసే 45 మంది కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా కొత్త బట్టలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్త బురాన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మంత్రి
మంత్రి వాకిటి


నారాయణపేట, 16 మార్చి (హి.స.)

మున్సిపాలిటీలో శుభ్రత, పరిశుభ్రత

పనులు చేసే 45 మంది కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా కొత్త బట్టలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ కార్యకర్త బురాన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేసే మహిళలు, పురుషులకు బట్టలు అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మానస, కమిషనర్ శ్రీరామ్, 13వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కులమత భేదాలు లేకుండా హిందువుల పండుగలకు కొత్త బట్టలు ధరించాలన్న సంకల్పంతో ముస్లిం నాయకుడు బురాన్ దుస్తులు అందించడం అభినందనీయమని మంత్రి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీలో ముస్లింలు, హిందువులు కలిసి జీవిస్తున్నారనడానికి ఇది మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. పీర్ల పండుగలు, ఉర్సులు వంటి కార్యక్రమాలను హిందువులు, ముస్లింలు కలిసి నిర్వహించడం మత సామరస్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రేమలు, ఆప్యాయతలు ఉన్నంత వరకు గొడవలు జరగవని, మతాల మధ్య వైషమ్యాలు రాకుండా ఇరువర్గాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande