ప్రజాకేంద్రీకృత పాలనే ప్రభుత్వ విధానం.. అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రస
Governor


హైదరాబాద్, 16 మార్చి (హి.స.)

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలోకి వెళ్లే ముందు గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం (Guard of Honour) సమర్పించారు. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రమించే తత్వం గల శాంతికాముక తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా ఈ వార్షిక బడ్జెట్ ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాకేంద్రీకృత పాలనే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు.

'2047 తెలంగాణ రైజింగ్' దిశగా అడుగులు వేస్తున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ 4.99 శాతం భాగస్వామ్యం ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మూసీ నదీ ప్రక్షాళన

చేసేందుకు ప్రణాళికను కూడా రచిస్తున్నామని అన్నారు. అందు కోసం మొత్తం 45 ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరడం సంతోషకరమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. క్యూరో, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ను అనుసరిస్తున్నామని అన్నారు. 2031 నాటికి పట్టణ జనాభ 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటిన్ ప్రాంతాన్ని కమిషనరేట్లుగా విభజించామని అన్నారు. హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. అదేవిధంగా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తును పరిరక్షించామని పేర్కొన్నారు.

కొండగల్ ప్రాంతం త్వరలోనే పారిశ్రామికవాడగా మారబోతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 23వ బయో ఆసియా సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. రూ.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో దేశంలోనే రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉందన్నారు. సేవారంగం 1.35 శాతం వృద్ధితో రాష్ట్ర జీవీఏకు 68.6 శాతం మేరకు దోహదపడుతోందని తెలిపారు. జీసీసీలలో 20 శాతం అతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారిందని అన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా కొనసాగుతుండటం సంతోషకరమని గవర్నర్ అన్నారు.

ఐటి ఎగుమతులు 5.3.13 లక్షల కోట్లకు చేరకున్నాయని శివప్రతాప్ శుక్లా అన్నారు. ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇక వ్యవసాయం అభివృద్ధికి రేర్ నమూన రూపొందించామని తెలిపారు. గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. పంట రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేశామన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. నిరుపేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నామని పేర్కొన్నారు. నరేగా ద్వారా 6.52 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించామని, మహాలక్ష్మి పథకం ద్వారా 269 కోట్ల ఉచిత ట్రిప్పుల ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పించామని అన్నారు.

ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించ తలపెట్టామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగంలో పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్లో కొత్త ఎయిర్పోర్టులు రాబోతున్నాయని అన్నారు. తెలంగాణను అభివృద్ధిలో గ్లోబల్ హబ్ల మర్చాలనుకుంటున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande