తిరుమలకు పెరిగిన భక్తుల తాకిడి.. ఈ ప్రాంతాల్లో దర్శనం టోకెన్ల పంపిణీ
తిరుమల, 16 మార్చి (హి.స.) శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండి.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూ లైన్లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్లాటెడ్ సర్వదర్
తిరుమల


తిరుమల, 16 మార్చి (హి.స.)

శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండి.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు క్యూ లైన్లో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనం సుమారు 4-6 గంటల సమయంలో జరగవచ్చని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పట్టవచ్చని పేర్కొంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిదర్శనానికి 18 గంటల సమయం పట్టవచ్చని పేర్కొంది. నిన్న (ఆదివారం) స్వామివారిని 82,057 మంది భక్తులు దర్శించుకోగా.. 30,990 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు సమకూరినట్లు టీటీడీ పేర్కొంది.

కాగా.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాలను అప్పటికప్పుడు మారుస్తోంది. నిన్న (ఆదివారం) భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ఉదయం 8.15 గంటల నుంచే విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, శ్రీవారిమెట్టు వద్ద టోకెన్లను పంపిణీ చేసింది. గంటకే టోకెన్లన్నీ అయిపోవడం గమనార్హం. రేపటి టైమ్ స్లాట్ దర్శనానికి సంబంధించిన టోకెన్లను నేడు పంపిణీ చేయనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఒక్కో టైమ్ స్లాట్ కు కొన్ని టోకెన్లను కేటాయించింది. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్సుల్లో 9,922 టోకెన్లను పంపిణీ చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande