
అమరావతి, 16 మార్చి (హి.స.)
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ వర్షపాతం ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఈ నెల 21వ తేదీ వరకు వర్షాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావం కారణంగా ఇవాళ మన్యం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో పోలవరం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణ, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV