తాగు నీటి పథకాలకు అమరజీవి జలధార అనింపేరు
అమరావతి, 17 మార్చి (హి.స.):అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ అన్నారు. సోమవారం అమరావతిలో పొట్టి శ్రీరాము లు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్
తాగు నీటి పథకాలకు అమరజీవి జలధార అనింపేరు


అమరావతి, 17 మార్చి (హి.స.):అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ అన్నారు. సోమవారం అమరావతిలో పొట్టి శ్రీరాము లు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ గడ్డపై నీళ్లు తాగుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేశాం’’ అని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసిందని వివరించారు. ‘‘అమరజీవి జలధార పథకం ద్వారా ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేసి ఐదు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా వచ్చే 30 ఏళ్లలో ఒక 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 9,355 కోట్లతో మరో ఏడు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నాం.

తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మూడు వేల ఆవాసాల్లో సింగిల్ విలేజ్ స్కీం కింద చేపట్టనున్నాం. రూ. 1,814 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాం. అన్ని తాగు నీటి పథకాలను ‘అమరజీవి జలధార’ పేరిట ముందుకు తీసుకువెళ్తాం’’ అని పవన్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande