దళిత.యువకుడు డ్రైవర్ వీధి .సుబ్రమణ్యం హత్యకేసు దర్యాప్తు .పూర్తి
, కాకినాడ: 17 మార్చి (హి.స.) దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసు దర్యాప్తు దాదాపు పూర్తయింది. 2022 మే 19న జరిగిన ఈ హత్యలో ఏ1 వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కాగా, ఏ2 ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజా.. నాడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్
దళిత.యువకుడు  డ్రైవర్ వీధి .సుబ్రమణ్యం  హత్యకేసు దర్యాప్తు .పూర్తి


, కాకినాడ: 17 మార్చి (హి.స.)

దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసు దర్యాప్తు దాదాపు పూర్తయింది. 2022 మే 19న జరిగిన ఈ హత్యలో ఏ1 వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కాగా, ఏ2 ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజా.. నాడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అనంతబాబు గతంలోనే కొన్నాళ్లు జైలు జీవితం గడిపి తర్వాత బెయిల్పై వచ్చి తిరుగుతున్నారు. ఆయన భార్య లక్ష్మీదుర్గను విచారించాలని ఇటీవల పోలీసులు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారామె. ఇటీవల కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఇన్నాళ్లు కలుగులో ఉన్న ఆమె పోలీసులు ఎదుట హాజరుకాక తప్పలేదు.

లక్ష్మీదుర్గ వచ్చిన కారుకు ముందు భాగాన నంబరు ప్లేటు ఏదీ?

కాకినాడ ఎస్డీపీవో కార్యాలయంలో సోమవారం జరిగిన విచారణకు అనంతబాబు దగ్గరుండి ఆమెను కారులో దిగబెట్టి వచ్చారు. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో మొక్కుబడి సమాధానాలే తప్ప పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఒక్కటీ ఆమె సక్రమంగా చెప్పలేదని తెలిసింది. ఆమె తీరు చూస్తే విచారణకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, అందుకే ఈనెలాఖరు వరకు కొనసాగించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఆమె ప్రమేయంపై తమ వద్ద సాంకేతిక ఆధారాలు చాలా ఉన్నాయని, వాటిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande