పోలవరం ప్రాజెక్ట్.తొలి దశ పనులకు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి
అమరావతి, 17 మార్చి (హి.స.) :పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే దిశగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థలు నిర్మాణంలో వేగాన్ని పెంచుతుంటే.. ఈ కీలక తరుణంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన పురోగతి ఎలా ఉందో పరిశీలించేందుక
పోలవరం ప్రాజెక్ట్.తొలి దశ పనులకు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి


అమరావతి, 17 మార్చి (హి.స.) :పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే దిశగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థలు నిర్మాణంలో వేగాన్ని పెంచుతుంటే.. ఈ కీలక తరుణంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన పురోగతి ఎలా ఉందో పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సిద్ధమైంది. ఆ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో యోగేశ్ పైథాంకర్ ప్రాజెక్టు ప్రాంతానికి రానున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. యోగేశ్ ఈ నెల 24న రాజమహేంద్రవరం చేరుకుంటారు. 25వ తేదీన వీఎల్ కాంతారావు వస్తారు. ఇద్దరూ కలిసి అదే రోజు పోలవరం ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి వెళ్తారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలిస్తారు. అదేవిధంగా ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం నిర్మించే గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతంలో వినియోగిస్తున్న మట్టి, రాళ్ల నాణ్యతను కూడా పరిశీలిస్తారు. వారు గమనించిన అంశాలను జలశక్తి శాఖ రికార్డు చేస్తుంది. వీటిని నివేదిక రూపంలో తయారుచేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande