తిరుమలలో భక్తజన సందోహం: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ!
తిరుమల, 17 మార్చి (హి.స.) కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో సర్వదర్శనం కోసం వ
తిరుమల


తిరుమల, 17 మార్చి (హి.స.)

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్లు బయటకు కొనసాగున్నాయి. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే మొత్తం 70,606 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 4.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande