విశాఖపట్నం రైల్వే.జోన్ కార్యక్రమం త్వరలో.ప్రారంభం
ఢిల్లీ, 18 మార్చి (హి.స.)విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw)స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) లోక్సభలో ఆయన మాట్లాడారు. వైజాగ్లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు
విశాఖపట్నం రైల్వే.జోన్ కార్యక్రమం త్వరలో.ప్రారంభం


ఢిల్లీ, 18 మార్చి (హి.స.)విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw)స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) లోక్సభలో ఆయన మాట్లాడారు. వైజాగ్లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించిందని ప్రస్తావించారు. సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రూ.106.89 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025 జనవరిలో ఈ జోన్కు శంకుస్థాపన జరిగిందని.. ప్రస్తుతం ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు VMRDA భవనం ‘ది డెక్’ సిద్ధమైందని అన్నారు. త్వరలోనే అక్కడి నుంచే పాలన జరుగుతుందని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande