
హైదరాబాద్, 18 మార్చి (హి.స.)మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన తెలిపారు. అసంబ్లీకి మొక్కజొన్న కంకులు తీసుకెళ్లగా వాటిని మార్షల్స్ లాక్కోవడంపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పండించారన్నారు. 25 శాతం పంట దళారుల చేతికి వెళ్తోందని చెప్పారు. పంటల బీమాను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. మొక్కజొన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని.. మద్దతు ధర రూ.2,400, బోనస్ రూ.500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్