దివ్యాంగ శక్తి' పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
AP


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ప్రారంభించిన ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణస్తూ ఎంతో లబ్ధిపొందుతున్నారన్నారు. చరిత్రలో దివ్యాంగులకు ఎప్పుడు మేలు జరిగినా అది సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘దివ్యాంగులకు సమాజంలో ప్రత్యేక గౌరవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆగస్టు 15న ప్రారంభించిన 'స్త్రీ శక్తి' పథకం అద్భుత విజయాన్ని అందుకుంది. అదే బాటలో ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ సూపర్ హిట్ అవుతుంది. ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించారంటే ఈ పథకం ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 12.70 లక్షల మంది దివ్యాంగులు ఉండగా.. ప్రస్తుతం 2 లక్షల మంది మాత్రమే పాస్లు కలిగి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారు. వారందరికీ పాస్లు అందేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం బస్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి, వంద శాంతం మందికి పాస్లు అందజేసేలా ప్రక్రియను సరళీకరణ చేస్తాం’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande