
హైదరాబాద్, 18 మార్చి (హి.స.)మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. పైలట్ రోహిత్ రెడ్డి తప్పు చేసినందుకు పార్టీ చర్యలు తీసుకుందన్నారు. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్ టెస్టులను నేను సిద్ధమని చెప్పానని మరి ఏమైందో అని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో అసంతృప్తి ఉన్నట్లుంది.ఆయన విషయంలో మేం ఎలాంటి చర్చలు చేయలేదన్నారు. ఎప్పుడు, ఎక్కడికి రావాలో కేసీఆర్ కు తెలుసని మమ్మల్నే తట్టుకోవట్లేదు.. ఇక వారికి కేసీఆర్ ఎందుకు అన్నారు.
రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు ఉత్తర్వు చూపిస్తే రాజీనామా చేస్తానన్నాను. అందుకు నేను రాజీనామా చేయాలని సీతక్క అంటున్నారు. కానీ సీతక్క మాటల్లో అర్థం లేదన్నారు. సభను తప్పుదోవ పట్టించిన భట్టి రాజీనామా చేయాలా లేక నేను చేయాలా అని ప్రశ్నించారు. ఉత్తర్వులు చూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. మూసీ, హ్యామ్ రోడ్లలో అవినీతిపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేపడతామన్నారు. పార్టీ మారి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు. కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి.
మూసీ డీపీఆర్ విషయంలో మొత్తం ప్లేట్ మార్చారు. మంత్రుల కంటే అధికారులు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆరునూరైనా మూసీ ప్రాజెక్టు చేపడతామని అధికారి ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. మూసీ డీపీఆర్ ఉంటే సభలో ప్రవేశపెట్టాలని డీపీఆర్ ప్రవేశపెట్టకపోతే శ్రీధర్ బాబు సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం నడుపుతున్న వారు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రణాళిక, డబ్బు లేకుండానే ఇండ్లు కూల్చేస్తున్నారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..