రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, 18 మార్చి (హి.స.) రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ) ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. పలువురు ర
Collector


రాజన్న సిరిసిల్ల, 18 మార్చి (హి.స.)

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ) ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్ రూమ్, వ్యాక్సినేషన్ గది, ఎక్స్ రే గది, యునాని హాస్పిటల్, ఆసుపత్రి ఆవరణ అంతా పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీఓకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మరమ్మత్తు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, జిల్లా వైద్య అధికారి రజిత, డీసీ హెచ్ ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, డాక్టర్ సృజన్, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande