జులై నాటికి కొత్త కోర్సుల సిలబస్: బాలకిష్టారెడ్డి
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి డిగ్రీ, పీజీలలో 39 నూతన కోర్సు
Syllabus


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి డిగ్రీ, పీజీలలో 39 నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నామని, అందుకు సంబంధించి జూన్-జులై నాటికి సిలబస్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. నూతన కోర్సులపై విద్యార్థులు, అధ్యాపకులతో మంగళవారం టీశాట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయన మాట్లాడారు. అధ్యాపకులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. డిగ్రీలో మూడు సబ్జెక్టులు కాకుండా ఏపీ తరహాలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం తీసుకురావాలని ఫోన్ ద్వారా ఒకరు కోరగా... ఆ విధానంపై సీఎం రేవంత్రెడ్డి నుంచి కూడా ఆదేశాలున్నాయని, అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande