ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది
అమరావతి, 19 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కమ్మరి పార్వతిని చైర్పర్సన్గా నియమించారు. తాజాగా డాక్టర్ వడ్డ శ్రీనివాసాచారి(ప్రొ
ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది


అమరావతి, 19 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కమ్మరి పార్వతిని చైర్పర్సన్గా నియమించారు. తాజాగా డాక్టర్ వడ్డ శ్రీనివాసాచారి(ప్రొద్దుటూరు), గుమ్మిండిపూడి దశరథ ఆచారి(శ్రీకాళహస్తి), కె.రంగాచారి(అనంతపురం అర్బన్), కర్రి అప్పలస్వామి(రాజమండ్రి రూరల్), కర్రి శేషగిరిరావు(జగ్గయ్యపేట), కోడూరి శేష బ్రహ్మచారి(పరుచూరు), మధుబాబు చిలకపాటి(కందుకూరు), మోడేపల్లి నాగు(ఏలూరు), గోడి నరసింహాచారి(విశాఖపట్నం సౌత్), పి.రామకృష్ణాచారి(మదనపల్లి), పద్మావతి తిరువళ్లూరు(గుంటూరు ఈస్ట్), సాయి తలాబత్తుల(పెద్దాపురం), తునికిపాటి శివ (జగ్గయ్యపేట), వసంతవాడ ఫణీంద్రకుమార్(నిడదవోలు), వీరాచారి మోతటాక(వినుకొండ)లను డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరంతా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande