
అమరావతి, 19 మార్చి (హి.స.), ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 16మంది ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ అవార్డులు ప్రకటించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్చంద్ర లడ్డా, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, పోలీసు పర్సనల్ విభాగం ఐజీ హరికృష్ణ, పీఅండ్ఎల్ ఐజీ రవిప్రకాశ్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబుకు ‘అతి ఉత్కృష్ట’ పురస్కారాలకు ఎంపియ్యారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, ఆక్టోపస్ ఐజీ సెంథిల్ కుమార్, అనంతపురం రేంజ్ ఐజీ షేముషి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ గీతాదేవికి ‘ఉత్కృష్ట’ అవార్డులు లభించాయి. ఐపీఎస్ అధికారి మొదలుకొని కానిస్టేబుల్ వరకూ రాష్ట్రానికి చెందిన 353 మందికి అతి ఉత్కృష్ట సేవా పతకాలు, మరో 607 మందికి ఉత్కృష్ట సేవా పతకాలు దక్కాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ