
అమరావతి, 19 మార్చి (హి.స.)
ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎంఆర్ఎఫ్ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించే సీమర్ ఎఫ్ ) తొలి సంతకం చేశారు. ఈ ఫైల్ ద్వారా 6,787 మందికి రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం 1,36,240 మందికి సాయం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ఓసీ కింద మొత్తం రూ.1,241 కోట్లను విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ