పేరంటాలమ్మ ఆలయం.వద్ద అపశ్రుతి
అమరావతి, 19 మార్చి (హి.స.)బొందిలిపాలెం(శావల్యాపురం), శావల్యాపురం మండలం బొందిలిపాలెం వద్ద ఉన్న శ్రీ అడవి పేరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా మతుకుమల్లికి చెందిన జనసేన నాయకులు తడిక ప్రభను నిర్మించారు. ఉగాది పురస్కరించుకుని గురువారం తిరునాళ్ల జరగనుంది.

ఈ నేపథ్యంలో గ్రామస్థులు ప్రభతో ఊరేగింపుగా దేవాలయం వద్దకు బుధవారం సాయంత్రం బయల్దేరారు. దాదాపు రెండు కిలోమీటర్లు దూరం వీర మహిళలు, జన సైనికుల కేరింతలతో ఉత్సాహంగా ప్రభ వెంట సాగారు. దేవాలయానికి అతి సమీపంలోకి వచ్చే సరికి మలుపు వద్ద ప్రభ అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. పక్కనే ఉన్న వరిగడ్డి వాములపై పడిపోయింది. రథం బండి కూడా పైకి లేచింది. ఆ సమయంలో ప్రభపై ఉన్న వారిలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్థులంతా ప్రభ కింద ఉన్న వారిని బయటకు తీశారు. పెను ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే శావల్యాపురం ఎస్సై మోర్ల వెంకటేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మరో 100 మీటర్లు ప్రభ తీసుకెళితే నిధిలోకి చేరేదని గ్రామస్థులు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande