దివ్యాంగులకు.అండగా నిలుస్తున కూటమి ప్రభుత్వం
అమరావతి, 19 మార్చి (హి.స.) ఒంగోలు కలెక్టరేట్, : వివిధ సంక్షేమ పథకాలతోపాటు దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని
దివ్యాంగులకు.అండగా నిలుస్తున కూటమి ప్రభుత్వం


అమరావతి, 19 మార్చి (హి.స.)

ఒంగోలు కలెక్టరేట్, : వివిధ సంక్షేమ పథకాలతోపాటు దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన పథకాన్ని జిల్లా స్థాయిలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో బుధవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ ప్రారంభించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 40 శాతం, అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. తద్వారా జిల్లాలో 21,969 మందికి ప్రయోజనం చేకూరనుంది. వీరందరూ ‘స్త్రీ శక్తి’ పథకం అమలవుతున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ఉచితంగా ప్రయాణించవవచ్చు. పథకానికి అవసరమైన డిజిటల్ పాస్లను మన మిత్ర వాట్సాప్ గవర్నెన్్్స యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande