రాష్ట్రంలో జూనియర్.కళాశాలలు. ఏపిల్ 1 వ తేదీన.పునః ప్రారంభం
అమరావతి, 19 మార్చి (హిం.స, , అమరావతి: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ఏప్రిల్ ఒకటో తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. 24 నుంచి
రాష్ట్రంలో జూనియర్.కళాశాలలు. ఏపిల్ 1 వ తేదీన.పునః ప్రారంభం


అమరావతి, 19 మార్చి (హిం.స,

, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ఏప్రిల్ ఒకటో తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టి, సీబీఎస్ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షల తర్వాత ఏప్రిల్లో తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యా ప్రణాళిక రూపొందించారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కేలండర్ను బుధవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా విడుదల చేశారు. విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. విద్యార్థుల ప్రవేశాల కోసం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారెంటీపై ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని, కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టించే హోర్డింగ్లు, కరపత్రాల పంపిణీ, గోడలపై రాతలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇవ్వరాదని కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande