
పోలవరం, 19 మార్చి (హి.స.): గత కొన్ని రోజులుగా హడలెత్తిస్తున్న పెద్దపులి కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రత్తిపాడు మండలం బాపన్నదొర కొండల నుంచి పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడుకు చేరింది. వెళ్లిన దారిలో పులి మళ్లీ వెనక్కి వచ్చినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని ఉర్లాకులపాడు, కోసూరివారి వీధి, జి.శరభవరం, వెంకట్ నగర్, మద్దిబందల, లోతావారి వీధి, చికిలింత, దుర్గానగర్, పెద గర్రంగి, చిన గర్రంగి, చెరువుకొమ్ముపాలెం, సంజీవ్నగర్, బోర్నగూడెం, కొట్టంపాలెం, మిరియాల వారి వీధి, గవరయ్యపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి ట్రాకింగ్ను పోలవరం డీఎఫ్వో శివకుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ