గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు శుభవార్త,రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని ఇండియాకు రావొచ్చు
హైదరాబాద్ , 02 మార్చి (హి.స.)అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తూ ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులకు శుభవార్త. ఇకపై వారు ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర హోంశ
గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు శుభవార్త,రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని ఇండియాకు రావొచ్చు


హైదరాబాద్ , 02 మార్చి (హి.స.)అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తూ ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులకు శుభవార్త. ఇకపై వారు ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వారంతా స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్ లోకి ప్రవేశించి అక్కడి నుండి భారత్ కు వచ్చేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు మస్కట్ లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ లెక్కన దుబాయి నుండి మస్కట్ ఎయిర్ పోర్టు వరకు రావాలంటే రోడ్డు మార్గాన 450 కి.మీలు ప్రయాణించాలి. అట్లాగే ఇతర గల్ఫ్ దేశాల నుండి మస్కట్ కు రోడ్డు మార్గాన రావాలంటే దాదాపు వెయ్యి కి.మీల వరకు ప్రయాణం చేయాలి.

*అలా చేరుకున్న వారంతా ఒమన్లోకి ప్రవేశించడానికి ముందుగానే విజిట్/టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి. ప్రయాణికులు ‘‘రాయల్ ఒమన్ పోలీస్ వెబ్సైట్’’ ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ముందుగా ఈ-వీసాకు దరఖాస్తు చేయాలి.

* అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతి ఉన్న భారత పాస్పోర్ట్ దారులకు ‘ఆన్-అరైవల్ వీసా’ సదుపాయం ఉంది. వారు రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా ఉన్నట్లయితే ముందస్తు వీసా లేకుండా గరిష్టంగా 14 రోజుల వరకు ఒమన్లో ప్రవేశించవచ్చు.

*గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు అయిన బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నివసిస్తూ చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డ్ కలిగిన భారత పౌరులకు కూడా ‘‘ఆన్-అరైవల్ వీసా’’ అందుబాటులో ఉంటుంది.

*వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్పోర్ట్ కనీసం 6 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.

*భారత్ కు తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులంతా ఏదైనా సమాచారం కావాలంటే ఒమన్ లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande