
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ, ఏపీ పీసీసీ చీఫ్లు మహేశ్కుమార్ గౌడ్, షర్మిలతో పాటు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. గత 9 రోజులుగా ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ శిబిరం అక్కడ కొనసాగుతోంది. నేడు జరిగే ముగింపు సమావేశంలో రాహుల్ పాల్గొని డీసీసీ అధ్యక్షులు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్