రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..
ఎర్రచందనం స్మగ్లర్ల అక్రమ దందాపై టాస్క్ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Red sandalwood


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలో కోళ్ల ఫారం మాటున స్మగ్లింగ్ చేస్తున్నారు.

అటవీ ప్రాంత సరిహద్దుల్లో స్మగ్లర్లు భారీ ఎత్తున ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు పక్కా సమాచారం అందిన వెంటనే సినీ ఫక్కీలో వారిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు.. పారిపోయే ప్రయత్నం చేసేలోపు వారిని పట్టుకున్నారు. స్మగ్లర్లను పట్టుకున్న బృందాన్ని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. స్మగ్లింగ్కు పాల్పడే వారిపై, సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande