తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాపును తనిఖీచేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
అమరావతి, 02 మార్చి (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు అనగా మార్చి 2, 2026న తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాప్ (సి.ఆర్.ఎస్)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాప్ చీఫ్
తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాపును తనిఖీచేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ


అమరావతి, 02 మార్చి (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు అనగా మార్చి 2, 2026న తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాప్ (సి.ఆర్.ఎస్)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు తిరుపతిలోని క్యారేజ్ రిపేర్ షాప్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ శ్రీ ఎస్. శ్రీనివాస్, గుంతకల్లు డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ యు. సుధాకర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు .

జనరల్ మేనేజర్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్లో క్షుణ్ణంగా నిర్వహించిన సి.బి.ఆర్ షాప్ తనిఖీలో, షాప్ పనితీరుతోపాటు వందే భారత్ కోచ్లు మరియు సాంప్రదాయ ఎ.సి కోచ్లను కూడా తనిఖీ చేశారు. ఇంకా, జనరల్ మేనేజర్ సి.ఎఫ్ (క్యారేజ్ ఫిట్టింగ్) షాప్, బోగీ సెక్షన్, వీల్ ప్రెస్ మెషిన్, ఎ.జె.టి.బి(ఆటోమేటిక్ జర్నల్ టర్నింగ్ &బరనిషింగ్) మెషిన్ వంటి ప్రతి విభాగం పనిని సమీక్షించడం ద్వారా మొత్తం వర్క్షాప్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ అవుట్గోయింగ్ షాప్లోని కోచ్లను, బయో-టాయిలెట్లను, ఓవర్హాలింగ్ సెక్షన్ను తనిఖీ చేశారు.

శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వర్క్షాప్లో అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలను పరిశీలించారు. వర్క్షాప్ సిబ్బందితో సంభాషించారు మరియు విధుల్లో ఉన్నప్పుడు పాటించాల్సిన భద్రతా జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్క్షాప్ అధికారులు మాస్టర్ ప్లాన్ను జనరల్ మేనేజర్కు వివరించారు మరియు వర్క్షాప్ విస్తరణకు సంబందించిన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.

తరువాత క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ అధికారులు వర్క్షాప్ పనితీరు మరియు పురోగతిని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు మరియు తదుపరి చర్యల గురించి చర్చించారు. ఈ తనిఖీ సమయంలో జనరల్ మేనేజర్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో సంభాషించి విజ్ఞప్తులను స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande