
అమరావతి, 02 మార్చి (హి.స.)సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా వేడుకలను సోమవారం నిర్వహించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ