పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ, 02 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘‘పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెతన్యాహుకు మోదీ ఫోన్


ఢిల్లీ, 02 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘‘పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అలాగే ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం’’ అని తమ సంభాషణ గురించి మోదీ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఇదిలాఉంటే.. ఆదివారం రాత్రి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీకి మోదీ (PM Modi) అధ్యక్షత వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయం తీసుకునే అత్యున్నత కమిటీ ఇది. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాలపై ఆ సందర్భంగా చర్చించారు.

యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌..

అమెరికా-ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) పైకి కూడా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఆ దేశంలో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో యూఈఏ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడుల్ని ఖండించారు.

6

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande