
కడప, 02 మార్చి (హి.స.)రాయలసీమ హక్కుల కోసం అన్ని శక్తుల ఐక్యం..స్పష్టమైన కార్యాచరణ..ప్రజా ఉద్యమానికి నాంది
రాయలసీమ హక్కుల సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడపలోని మేడా కన్వెన్షన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ సాధనపై స్పష్టమైన కార్యాచరణతో, ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతూ ఈ సమావేశం జరిగింది.
ఈ కీలక సమావేశానికి పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎంపీ లు వైయస్ అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆర్ కె రోజా గారు, ఉషశ్రీ చరణ్ గారు, సాకే శైలజా నాథ్ గారు, ఆదిమూలపు సురేష్ గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, కడప అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు రవీంద్రనాధ రెడ్డి గారు, ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, రాజంపేట పరిశీలకులు సురేష్ బాబు గారు, అనంత వెంకట్రామి రెడ్డి గారు, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు, ఎస్వీ మోహన్ రెడ్డి గారు, బూచేపల్లె శివ ప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో నేతలంతా ఒకే స్వరంతో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై రాయలసీమ ప్రయోజనాల కోసం వైయస్ఆర్ సీపీ ఇతర అనుకూల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలతో చేతులు కలిపి భారీ స్థాయిలో పోరాట కార్యక్రమాలు నిర్వహించనుంది. సీమ హక్కుల కోసం రాజీ పడబోమని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ జ్వాలలు రగిలిస్తామని నేతలు హెచ్చరించారు. రాయలసీమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఈ సమావేశం ద్వారా నేతలు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ