విశాఖకు చెందిన అన్మిష్ వర్మ ప్రపంచం లోని.ఏడు అగ్ని పర్వతాలు.అధిరోహించారు
, విశాఖపట్నం 22 మార్చి (హి.స.) : విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గతంలో 200 రోజుల ప్రపంచ రికార్డు ఉండగా దాన్ని అన్మిష్ కేవలం 92 రోజుల
విశాఖకు చెందిన  అన్మిష్ వర్మ ప్రపంచం లోని.ఏడు అగ్ని పర్వతాలు.అధిరోహించారు


, విశాఖపట్నం 22 మార్చి (హి.స.)

: విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. గతంలో 200 రోజుల ప్రపంచ రికార్డు ఉండగా దాన్ని అన్మిష్ కేవలం 92 రోజుల 4 గంటల్లోనే చేరుకొని రికార్డు నెలకొల్పారు. ఈ ఘనతను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అధికారికంగా గుర్తించి ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు.

‘సాహసాలు చేయడమంటే నాకు ఆసక్తి. అందులో భాగంగానే ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలను అధిరోహించా. అత్యంత కఠినమైన దక్షిణ ధ్రువానికి చేరుకున్నా. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అగ్ని పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. గత ఏడాది అక్టోబర్ 23న రష్యాలోని ఎల్బ్రస్ పర్వత అధిరోహణతో మొదలుపెట్టి ఆ తర్వాత అర్జెంటీనాలోని ఒజాస్ డెల్ సలాడో, టాంజానియాలోని కిలిమంజారో, మెక్సికోలోని పికో డె ఒరిజాబా, ఇరాన్లోని దమావంద్, పపువా న్యూ గినీలోని గిలూవే పర్వతాలను అధిరోహించా. ఈ ఏడాది జనవరి 23తో అంటార్కిటికాలోని సిడ్లీ అగ్నిపర్వతాన్ని ఎక్కడం ద్వారా నా ప్రయాణం పూర్తయింది. ముఖ్యంగా సిడ్లీ పర్వతానికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ దశలో చాలా దూరం వెళ్లాక గైడ్కు అనారోగ్యం కలిగింది.

దాంతో కిందికి వచ్చి మళ్లీ పైకి వెళ్లాం. ఇందుకు పది రోజుల సమయం పట్టింది. ఇలాంటి అనుభవాలు ఈ ప్రయాణంలో చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియలో మైనస్ 60 డిగ్రీల మంచులో ప్రమాదకరంగా.. తిండి లేకుండా ముందుకు సాగాం. వాస్తవానికి ఏడు పర్వతాలను 60 రోజుల్లో చేరుకోవాలనేది లక్ష్యం. వాతావరణం, ఇతర సమస్యల కారణంగా 92 రోజులు పట్టింది’ అని అన్మిష్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande