ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు
, తిరుమల, 22 మార్చి (హి.స.) :ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమలలో కుటుంబ సమేతంగా పర్యటించారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆయన.. శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు


,

తిరుమల, 22 మార్చి (హి.స.) :ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తిరుమలలో కుటుంబ సమేతంగా పర్యటించారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆయన.. శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనవడు దేవాంశ్, మరదలు ఇందిర, సోదరి కుమార్తె భర్త దిలీప్తో కలిసి సంప్రదాయ వస్త్రధారణ, నుదుట తిరునామంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన మహద్వారం నుంచి లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అయినా.. ఎప్పటిలానే సామాన్య భక్తుడిలా క్యూలైన్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకబృందం, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన సీఎం.. ధ్వజస్తంభానికి నమస్కరించారు. తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అర్చకులు, జీయర్స్వాములు ఆయనతో శ్రీవారి శేషవస్ర్తాన్ని ధరింపజేశారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని ఆలయ ప్రదక్షణగా వచ్చి విమానవేంకటేశ్వరస్వామిని, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని సీఎం దర్శించుకున్నారు. హుండీలో కానుకలు వేసి రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పంచాంగం తదితరాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande