త్వరలోనే నెల్లూరుకు.భారీ పరిశ్రమ
నెల్లూరు 22 మార్చి (హి.స.)త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి )వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభ
త్వరలోనే నెల్లూరుకు.భారీ పరిశ్రమ


నెల్లూరు 22 మార్చి (హి.స.)త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి )వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరులో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్టైలే వేరని ప్రశంసించారు.

ఈరోజు పడారుపల్లిలో అభివృద్ది పనుల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. పడారుపల్లిలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో తిరునాళ్ల వాతావరణాన్ని తలపించేలా టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande