జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 22 మార్చి (హి.స.) జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు* రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 22 మార్చి (హి.స.)

జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు*

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా జిల్లా డీసీసీ కమిటీలను ప్రకటించిన అనంతరం, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

ఈ పర్యటనల ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చర్యలు చేపట్టనున్నారు.

ప్రతి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులపై సమీక్ష చేపట్టనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసి, భవిష్యత్ ఎన్నికల దిశగా పటిష్ట కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి.

అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాల పర్యటనల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande