
నెల్లూరు, 22 మార్చి (హి.స.)
నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికలో ఒక వ్యక్తి సగం కాలిన మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఉదయం శ్మశాన వాటికకు వెళ్లిన స్థానికులు, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సగం కాలిపోయి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అది బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిదిగా ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహం పక్కనే పడి ఉన్న సెల్ఫోన్, సిమ్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మృతుడి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
హత్య చేశారా?
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. అసలు ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV