నేను మోడీకి అంధ భక్తురాలిని.. రేణు దేశాయ్ పోస్టు వైరల్
అమరావతి, 22 మార్చి (హి.స.)ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ
i-am-a-blind-devotee-of-modi-renu-desais-comments-on-the-movie-dh


అమరావతి, 22 మార్చి (హి.స.)ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమాను వీక్షించిన రేణుదేశాయ్ ఈ సినిమాకు సంబంధించిన రివ్యూను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ 'నేను బీజేపీకి, మన దేశ ప్రధాని మోడీకి గర్వించదగ్గ అంధభక్తురాలిని (Proud Andhbhakt) అని ఆమె ఇన్ స్టా స్టేటస్ లో పోస్టు చేశారు. సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర 'ఈ ఛాయ్వాలా భారత్లోకి వచ్చాక మనవాళ్లలో భయం పెరిగింది' అని చెప్పే డైలాగ్ను ఆమె రీ-షేర్ చేస్తూ మోడీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

అలాటి వారు కచ్చితంగా చూడండి:అలాగే దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పట్ల కనీస గౌరవం లేకుండా దేశం గురించి తప్పుగా మాట్లాడే వారు ఖచ్చితంగా ‘ధురంధర్’ సిరీస్ చూడాలని ఈ సందర్భంగా రేణు దేశాయ్ సూచించారు. మనం మన ఇళ్లలో హాయిగా నిద్రపోవడానికి వారి కృషే కారణమని పేర్కొన్నారు. కాగా ధురందర్ పార్ట్ -1 పార్ట్-2 సినిమాలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సినిమాలోని పలు సన్నివేశాల పట్ల పార్టీలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలోని కంటెంట్పై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్న వేళ తాను బీజేపీకి, మోడీకి అంధభక్తురాలిని అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande